-
-
Home » Andhra Pradesh » devineni uma complaint on ambati-MRGS-AndhraPradesh
-
అంబటిపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయనున్న దేవినేని ఉమ
ABN , First Publish Date - 2022-06-07T18:07:53+05:30 IST
తనపై తప్పుడు ట్వీట్ చేసిన మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ అధికారులకు మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు చేయనున్నారు.

అమరావతి : తనపై తప్పుడు ట్వీట్ చేసిన మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ అధికారులకు మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అసత్య ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొననున్నారు. సీఐడీ కార్యాలయానికి వెళుతున్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు.