ఏపీలో రూ.1.5లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-06-07T10:20:28+05:30 IST

రాష్ట్రంలో రూ.1.5 లక్షల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్‌ ఆరమనే పేర్కొన్నారు.

ఏపీలో రూ.1.5లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్‌ 

పుట్టపర్తి, జూన్‌ 6: రాష్ట్రంలో రూ.1.5 లక్షల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్‌ ఆరమనే పేర్కొన్నారు. సోమవారం ఆయన శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. కొత్త జిల్లాలను అనుసంధానిస్తూ రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు-విజయవాడను కలుపుతూ కొత్తరహదారి ఏర్పాటుకు భూసేకరణ పూర్తి కావచ్చిందనీ, ఐదు నెలల్లో టెండర్లు పిలుస్తామని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షించామని, ఎక్కువ జనాభా ఉన్న, పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎయిర్‌ పోర్టులు, ఓడరేవులను కలుపుతూ హైవేలను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెంబర్‌ కార్యదర్శి మహవీర్‌సింగ్‌ మోర్తు, జిల్లా కలెక ్టర్‌ బసంత్‌కుమార్‌, జోన్‌ 3 ఏడీ జీఎం రవిప్రసాద్‌, జేసీ నవీన్‌ పాల్గొన్నారు.

Read more