దళితుల పరిస్థితి కూలిచ్చి దెబ్బలు కొట్టించుకున్నట్టుగా ఉంది: దేవతోటి

ABN , First Publish Date - 2022-03-16T16:03:42+05:30 IST

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్ రెడ్డి పాలన.. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజల్లోకి రావాలనుకోవడం అవకాశవాద రాజకీయమని..

దళితుల పరిస్థితి కూలిచ్చి దెబ్బలు కొట్టించుకున్నట్టుగా ఉంది: దేవతోటి

అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్ రెడ్డి పాలన.. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజల్లోకి రావాలనుకోవడం అవకాశవాద రాజకీయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేసిన దళితుల పరిస్థితి కూలి ఇచ్చి దెబ్బలు కొట్టించుకున్నట్టుగా ఉందన్నారు. జగన్ రెడ్డి పాలన హత్యా రాజకీయాలు, కల్తీ మద్యం చావులు, కులాల కుమ్ములాటల ప్రాతిపదికనే సాగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సాగాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.

Read more