చంద్రబాబుది రాక్షస మనస్తత్వం : నారాయణ స్వామి

ABN , First Publish Date - 2022-09-21T15:45:37+05:30 IST

23న సీఎం కుప్పం రాబోతున్నారు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు

చంద్రబాబుది రాక్షస మనస్తత్వం : నారాయణ స్వామి

అమరావతి : 23న సీఎం జగన్ (CM Jagan) కుప్పం (Kuppam) రాబోతున్నారు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Deputy CM Narayana Swamy) పేర్కొన్నారు. నేడు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ (Assembly Media Point)లో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తప్పుడు మీడియాని పెట్టుకుని బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవాడి పిల్లాడు చక్కగా చదువుకోవాలని అమ్మ ఒడి తెచ్చారు. 85 శాతం మందికి కుప్పంలో అమ్మ ఒడి వర్తింపు చేస్తున్నాం. చంద్రబాబు కుప్పం ప్రజలకు ఒక్కరికైన డబ్బులు ఇచ్చాడా? ఒక్కరి అకౌంట్‌లో అయినా డబ్బులు వేసాడా? 


నాన్ లోకల్ (Non Local) చంద్రబాబు లోకల్‌గా ఏమి చెయ్యలేదు. 175 నియోజకవర్గాలు గెలుస్తాం దానికి కుప్పం నాంది. చంద్రబాబు ఎప్పుడు కుప్పం వచ్చిన గలాటాలే, రచ్చలే. జనాన్ని రెచ్చగొట్టి బోరుమని ఏడుస్తాడు. చంద్రబాబు ఒక ఔరంగాజేబు లాంటోడు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తే... వైసీపీ 60 శాతం ఓట్లతో గెలుస్తుంది. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం... జన్మలో మారడు. జడ్జ్‌లు కూడా రాజకీయ నాయకుల్లా (Political leaders) మాట్లాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు సపోర్ట్ చెయ్యాలని నా విజ్ఞప్తి. పేద వారికి సెంటు భూమి ఇస్తే కూడా స్టేలు తెస్తున్నారు. మద్యంపై నడిచింది టీడీపీ.. వైసీపీ కాదు. ఒకరోజు టైం చెప్తే మద్యంపై పూర్తి క్లారిటీతో మాట్లాడతా. సారాను తీసుకొచ్చిందే టీడీపీ. నేను పారిపోను మద్యంపై చర్చకు సిద్ధంగా ఉన్నా’’ అని పేర్కొన్నారు.


Read more