గోరంట్ల మాధవ్‌పై పరువు నష్టం దావా

ABN , First Publish Date - 2022-08-11T08:07:23+05:30 IST

గోరంట్ల మాధవ్‌పై పరువు నష్టం దావా

గోరంట్ల మాధవ్‌పై పరువు నష్టం దావా

క్రిమినల్‌ చర్యలూ తీసుకోవాలి

హైకోర్టులో కేసు వేయాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ నిర్ణయం

దూషణలపై న్యాయపరమైన చర్యలు


హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నగ్న వీడియో ప్రసారం చేశారంటూ అసభ్యపదజాలంతో, వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు. గోరంట్ల మాధవ్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. ఆయనపై క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం నుంచి గోరంట్ల మాధవ్‌ ‘డర్టీ పిక్చర్‌’ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సహా పలు మీడియా సంస్థలు దీనిపై కథనాలను ప్రసారం చేశాయి. అదేరోజున మీడియా ముందుకు వచ్చిన ఎంపీ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీని అసభ్య పదజాలంతో దూషించారు. బుధవారం మరోసారి ఇదే రీతిలో మాట్లాడారు. దీంతో న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిర్ణయించుకున్నారు.

Read more