దశాబ్దాలుగా రాయలసీమకు అన్యాయం : దశరథరామిరెడ్డి

ABN , First Publish Date - 2022-11-16T15:09:30+05:30 IST

శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేయాలని కోరుతూ రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆద్వర్యంలో రాయలసీమ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది.

దశాబ్దాలుగా రాయలసీమకు అన్యాయం : దశరథరామిరెడ్డి

Vijayawada : శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేయాలని కోరుతూ రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆద్వర్యంలో రాయలసీమ సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రాయలసీమకు పాలకులు అన్యాయం చేస్తూనే ఉన్నారన్నారు. సీఆర్డీఏ చట్టంలో సవరణలు చేసి వెనుకబడిన ప్రాంతాలకు కూడా సమన్యాయం చేయాలన్నారు. మూడు రాజధానులతో పాలనా వికేంద్రీకరణ అంటూ ప్రభుత్వం మభ్యపెడుతోందని దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక అమలుకు ఉద్యమించాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు కల్పించిన హక్కులు తక్షణమే అమలు పరచాలని దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-11-16T15:09:30+05:30 IST

Read more