మేరుగపై ‘దళిత’ నేతల మండిపాటు

ABN , First Publish Date - 2022-09-17T10:31:22+05:30 IST

మేరుగపై ‘దళిత’ నేతల మండిపాటు

మేరుగపై ‘దళిత’ నేతల మండిపాటు

మంగళగిరి సిటీ, తెనాలి, సెప్టెంబరు 16: అసెంబ్లీ సాక్షిగా కొండెపి దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై మంత్రి మేరుగ నాగార్జున చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ దళిత నేతలు భగ్గుమన్నారు. మంత్రి మేరుగ వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళగిరి, తెనాలిల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెనాలిలో టీడీపీ ఎస్సీసెల్‌ నాయుకులు మంత్రి దిష్టిబొమ్మను గాంధీచౌక్‌ వద్ద దహనం చేసి నిరసన తెలిపారు. మంగళగిరిలో మేరుగ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్‌ నేతలు మాట్లాడుతూ  ఎస్సీ కార్పొరేషన్‌ నిధులను దళితులకు ఒక్క పైసా కూడా ఇప్పించలేకపోయిన మంత్రి మేరుగ నిజంగా దళితులకే పుట్టాడా అని ప్రశ్నించారు. ఒక ఆర్థిక ఉగ్రవాది నాయకత్వంలో పనిచేస్తున్న నాగార్జునను చదువుకున్న సంస్కార హీనుడిగా అభివర్ణించారు.

Read more