నాడు-నేడుపై ప్రతినెలా ఆడిట్‌

ABN , First Publish Date - 2022-09-13T08:18:41+05:30 IST

పాఠశాలల్లో నాడు-నేడు పనులపై ప్రతినెలా క్రమం తప్పకుండా ఆడిట్‌ చేపట్టాలని సీఎం జగన్‌ స్పష్టంచేశారు.

నాడు-నేడుపై ప్రతినెలా ఆడిట్‌

విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో నాడు-నేడు పనులపై ప్రతినెలా క్రమం తప్పకుండా ఆడిట్‌ చేపట్టాలని సీఎం జగన్‌ స్పష్టంచేశారు. ఆ పనులపై ఆయన సోమవారమిక్కడ సమీక్షించారు. పాఠశాలల్లో సౌకర్యాలపై పరిశీలన చేయాలని, అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతులు ప్రారంభించాలన్నారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే నాటికే విద్యాకానుకలు సిద్ధంగా ఉంచాలన్నారు. యూనిఫాం, కుట్టుకూలి నగదు కూడా అదే రోజున తల్లుల ఖాతాల్లో వేయాలన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు, టీచర్లకు 5,18,740 ట్యాబ్‌లు ఇస్తున్నామని, వాటిలో బైజూస్‌ కంటెంట్‌ ఉంటుందన్నారు.

Read more