నైపుణ్యాభివృద్ధికి యువత ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-10-18T09:49:42+05:30 IST

దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలంటే యువతలో నైపుణ్యం, అంకితభావం అవసరమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌

నైపుణ్యాభివృద్ధికి యువత ప్రాధాన్యం ఇవ్వాలి

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి


తాడేపల్లి, అక్టోబరు17 : దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలంటే యువతలో నైపుణ్యం, అంకితభావం అవసరమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్‌  యూనివర్సిటీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కిషన్‌రెడ్డి మాట్లాడుతూ   రానున్న 20 సంవత్సరాలు అత్యంత కీలకమని, మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్‌ 1గా తీర్చి దిద్దేందుకు ఇదే సువర్ణ అవకాశమన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఏ రంగంలో చూచినా భారతదేశ పౌరులే అత్యున్నత స్థానంలో ఉన్నారన్నారు. విద్యా రంగం అభివృద్ధి కోసం నూతన విద్యా విధానాన్ని కేంద్రం అమలు చేస్తోందని చెప్పారు. కేఎల్‌ యూనివర్సిటీలో అందిస్తున్న విద్యా విధానాన్ని, సౌకర్యాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, వీసీ డాక్టర్‌ సారధి వర్మ, అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె శ్రీనివాసరావు, వివిధ విభాగాల డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T09:49:42+05:30 IST