చట్టాలకు సొంత భాష్యాలు

ABN , First Publish Date - 2022-04-24T09:56:56+05:30 IST

కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు.

చట్టాలకు సొంత భాష్యాలు

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ కేంద్రం: రామకృష్ణ


గుంతకల్లు, ఏప్రిల్‌ 23: కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. శోభా యాత్రలో జరిగిన ఘర్షణను సాకుగా చేసుకుని బుల్డోజరుతో కట్టడాలను కూల్చివేశారని మండిపడ్డారు. సుప్రీం కో ర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా గంటన్నర సేపు కూ ల్చివేతను కొనసాగించి, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అన్నారు. అనంతపురం జిల్లాలో శనివారం మాట్లాడా రు. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు తాము అతీతులమమమమన్న విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు.  మోదీ అధికారంలోకి వచ్చాక ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని అన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌, కరకట్టపై  ప్రజా వేదికను కూల్చివేసిందన్నారు. ఆ తర్వాత ఎలాంటి అక్రమ కట్టడాలను కూల్చివేసిన పాపానపోలేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను ఇలా తమకు అనుకూలంగా వాడుకుంటూ, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని, ప్రజల జీవితాలతో అడుకుంటున్నాయని విమర్శించారు.

Read more