CPI leader Ramakrishna: ఏపీలో అసలు రాజ్యాంగం అమలులో ఉందా..?

ABN , First Publish Date - 2022-09-10T18:15:48+05:30 IST

హై కోర్టు(High Court) తీర్పు అనంతరం అమరావతి(Amaravati) అంశం ముగిసిందని అనుకున్నామని సీపీఐ నేత రామకృష్ణ

CPI leader Ramakrishna: ఏపీలో అసలు రాజ్యాంగం అమలులో ఉందా..?

Vijayawada: హై కోర్టు(High Court) తీర్పు అనంతరం అమరావతి(Amaravati) అంశం ముగిసిందని అనుకున్నామని సీపీఐ నేత రామకృష్ణ (CPI leader Ramakrishna) అన్నారు. కానీ, ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి వెనక్కు తీసుకున్నట్టు అఫిడవిట్ వేయడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మళ్ళీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన అన్నారు. ఏపీలో(AP) అసలు రాజ్యాంగం అమలులో ఉందా? అని ప్రశ్నించారు. రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా..మంత్రులు(Ministers) రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖ(Visakha) అభివృద్ధికి కారణమైన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఏం మాట్లాడాలో కూడా మంత్రులకు చీటీ రాసిస్తున్నారని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2022-09-10T18:15:48+05:30 IST