Ramakrishna: పండుగలకు కందిపప్పు, పంచదారలను అందించండి

ABN , First Publish Date - 2022-10-03T15:27:03+05:30 IST

దసరా, దీపావళి పండుగల సందర్భంగా కందిపప్పు, పంచదారలను కార్డుదారులకు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

Ramakrishna: పండుగలకు కందిపప్పు, పంచదారలను అందించండి

అమరావతి: దసరా, దీపావళి పండుగల సందర్భంగా కందిపప్పు, పంచదారలను కార్డుదారులకు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌ (Jagan mohan reddy)కు రామకృష్ణ లేఖ రాశారు. గత 6 నెలలుగా రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార సరఫరా సక్రమంగా లేదన్నారు. పంచదారకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పాత బకాయిలు జగన్ సర్కార్ (Jagan government) చెల్లించలేదని విమర్శించారు. బిల్లులు వస్తాయో రావోనన్న భయంతో కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేయకపోవటం గమనార్హమన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను అస్తవ్యస్తంగా మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తున్నామని రామకృష్ణ (CPI Leader) లేఖలో పేర్కొన్నారు. 

Read more