సీఎంపై సభాహక్కుల నోటీసు తిరస్కరిస్తున్నా: మండలి చైర్మన్‌

ABN , First Publish Date - 2022-03-18T08:12:47+05:30 IST

సీఎంపై సభాహక్కుల నోటీసు తిరస్కరిస్తున్నా: మండలి చైర్మన్‌

సీఎంపై సభాహక్కుల నోటీసు తిరస్కరిస్తున్నా: మండలి చైర్మన్‌

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిపై టీడీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసును తిరస్కరించినట్టు శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రకటించారు.‘‘సీఎం ఒక సభలో మాట్లాడిన ఒక అంశంపై మరో సభలో హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం గతంలో ఎన్నడూ జరగలేదు. పక్క సభలో జరిగి అంశాన్ని ఈ సభ చర్చించదు. కాబట్టి టీడీపీ ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తున్నాను’’ అని చైర్మన్‌ వెల్లడించారు. 

Read more