కాపులు జగన్‌కు ఓటెందుకు వేయాలి

ABN , First Publish Date - 2022-11-03T04:31:35+05:30 IST

‘రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. రాయలసీమ ప్యాక్షన్‌ రాజకీయాన్ని జగన్‌ ఇక్కడ అమలు చేస్తున్నారు.

కాపులు జగన్‌కు ఓటెందుకు వేయాలి

టీడీపీ, జనసేన కలవకూడదన్నదే సీఎం ప్రయత్నం: చేగొండి

పాలకొల్లు, నవంబరు 2: ‘‘రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. రాయలసీమ ప్యాక్షన్‌ రాజకీయాన్ని జగన్‌ ఇక్కడ అమలు చేస్తున్నారు. మూడు రాజధానులంటూ నాంది పలకడం.. ముందు ముందు రాష్ట్ర విభజనకు నాంది పలకడమే. దీనిని ప్రజలంతా ఖండించాలి’’ అని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం, జనసేన కలిసి ప్రయాణం చేయడంలో తప్పు లేదు. జగన్మోహన్‌రెడ్డి లిక్కర్‌, ఇసుక వ్యాపారాలతోపాటు చివరకు రైతులకు ఇచ్చే విద్యుత్‌ మీటర్ల కాంట్రాక్టులో సైతం అవినీతికి పాల్పడుతున్నారు. మౌలిక వసతులు, అభివృద్ధి మరిచిపోయారు. కేవలంకొద్ది జనాభాకే నవరత్నాల పేరిట ప్రజా సొమ్ము వృఽథా చేస్తున్నారు. ఈ పరిస్థితిలో పవన్‌ కొన్ని షరతులతో టీడీపీతో జత కడితేనే మెరుగు. బీసీలకు భయపడి జగన్‌ విద్య, ఉద్యోగాలలో కాపులకు రిజర్వేషన్‌ సౌకర్యం అంద జేయడం లేదు. ఈ పరిస్థితిల్లో వచ్చే ఎన్నికల్లో జగన్‌కు కాపు సోదరులు ఎందుకు ఓటు వేయాలి? జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా బలపడుతున్న సందర్భంలో ఆయనను బలహీన పరచడానికి కుయుక్తులు పన్నుతున్నారు. కొందరు కాపు కులస్తులకు మంత్రి పదవులు, కార్పొరేషన్‌ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చినంత మాత్రాన కాపులకు మేలు చేసినట్లు కాదు. టీడీపీ, జనసేన కలవకూడదన్నదే జగన్‌ ప్రయత్నం. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే విజయం తఽథ్యం. ఎన్నికల్లో విజయం సాధించగలిగితే ఉభయ పార్టీలు అధికారం (వపర్‌ షేరింగ్‌) విషయంలో సయోధ్య కుదుర్చకోవాలి. ఏ కారణం చేత అయినా అటువంటి ఒప్పందం సాధ్యపడకపోతే సొంతంగా పోటీ చేసి, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా పవన్‌కు ఉంది. రాజకీయాల్లో అవసరాలను బట్టి సమీకరణాలు మారుతుంటాయి. దేవినేని నెహ్రూకుమారుడు అవినాశ్‌ వైసీపీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నపుడు వంగవీటి రంగ కుమారుడు రాధా టీడీపీలో క్రియాశీలకంగా ఉండటం తప్పేమిటి?’’ అని హరిరామ జోగయ్య అన్నారు.

Updated Date - 2022-11-03T04:31:36+05:30 IST