-
-
Home » Andhra Pradesh » Cooking oils at specified prices-NGTS-AndhraPradesh
-
నిర్దేశిత ధరలకే వంటనూనెలు: సీఎస్
ABN , First Publish Date - 2022-03-16T09:12:41+05:30 IST
నిర్దేశిత ధరలకే వంటనూనెలు: సీఎస్

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ధరల నియంత్రణకు మార్కెట్ స్థిరీకరణ కింద రైతుబజార్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటుచేసి నిర్దేశిత ధరలకు వినియోగదారులకు వంటనూనెలు అందేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులను చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ ఆదేశించారు. రేషన్ షాపుల ద్వారా కూడా వంటనూనెల విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంటనూనెల ధరల పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం మంగళవారం సీఎస్ నేతృత్వంలో జరిగింది.