తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-07-10T13:56:47+05:30 IST

తిరుమల(Tirumala)లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమల(Tirumala)లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 87,478 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  48,692 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.53 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Read more