అచ్చే దిన్ అంటూ.. చచ్చే ది చూపిస్తున్నారు: Tulasireddy

ABN , First Publish Date - 2022-07-07T17:26:01+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదే పదే వంట గ్యాస్ ధర పెంచడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

అచ్చే దిన్ అంటూ.. చచ్చే ది చూపిస్తున్నారు: Tulasireddy

అమరావతి: కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం పదే పదే వంట గ్యాస్ ధర పెంచడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి (Tulasi reddy) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...  గడిచిన మూడు నెలల్లో నాలుగు సార్లు పెంచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో సిలిండర్ ధర రూ.410 ఉండగా, నేడు రూ.1100లు  దాటిందని మండిపడ్డారు. గృహిణులు వంట గదిలోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారన్నారు. ‘‘ఒక వైపు అచ్చే దిన్ అంటూ, మరోకవైపు చచ్చే ది చూపిస్తున్నారు ప్రధాని’’ అంటూ మండిపడ్డారు. పెంచిన వంట గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర తగ్గిస్తేనే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇస్తామని లేకుంటే వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ (TDP), టీడీపీ (TDP) పార్టీలు ప్రకటించాలని పేర్కొన్నారు. వంట గ్యాస్ ధర పెంపుపై జనసేన (Janasena) తన వైఖరిని స్పష్టం చేయాలని తులసిరెడ్డి తెలిపారు. 

Read more