కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర, అసందర్భ ప్రక్రియ: Tulasi reddy

ABN , First Publish Date - 2022-02-23T18:01:29+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర, అసందర్భ ప్రక్రియ అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర,  అసందర్భ ప్రక్రియ: Tulasi reddy

అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర, అసందర్భ ప్రక్రియ అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇది కందిరీగల తుట్టెను లేపి కుట్టించుకోవడమే అని వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడుతుందే తప్ప ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు. 13 అదనపు జిల్లా కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించే ఆర్థిక శక్తి, ఈ  ప్రభుత్వానికి ఉందా! అని ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టని ప్రభుద్దుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుంది జగన్ ప్రభుత్వ వాలకమని యెద్దేవా చేశారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఎలక్ట్రానిక్ పాలన సాగుతున్న ఈ రోజుల్లో అదనపు జిల్లాలు అవసరమా? అని నిలదీశారు. అంగన్వాడీ వర్కర్ల , ఆశా వర్కర్ల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవన్నారు. వీరి డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. వీరి డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందని తులసిరెడ్డి అన్నారు.

Read more