‘ఆంధ్రజ్యోతి’తోనే పోటీ

ABN , First Publish Date - 2022-03-16T09:11:19+05:30 IST

వైసీపీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోటీయేకాదని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.

‘ఆంధ్రజ్యోతి’తోనే పోటీ

  • చంద్రబాబును పట్టించుకోనక్కర్లేదు
  • పార్టీ ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ ప్రక్షాళన
  • వైసీపీ ఎల్పీ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌ 


అమరావతి: వైసీపీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోటీయేకాదని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. అసలు రాజకీయంగా ఆయనను, టీడీపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతితోనే పోటీ అని వ్యాఖ్యానించారు. ‘‘మనం కంటికి కనిపించని మారీచులు ఏబీఎన్‌ చానల్‌,  ఆంధ్రజ్యోతితోనే యుద్ధం చేస్తున్నాం. ఈనాడు, ఈటీవీ, టీవీ-5తో మనం యుద్ధం చేస్తున్నాం’’ అని సీఎం జగన్‌ అన్నారు. వైసీపీ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలెవరూ తమ అభిప్రాయాలు చెప్పకూడదని ముందే కట్టడి చేశారు. ఏదైనా సమస్యను లేవనెత్తితే... ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపించారంటూ చిలువలు పలువలుగా రాస్తారని...  అందుకే ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించారు.

Read more