Bapatla: పొలంలో కలెక్టర్లు.. ఆశ్చర్యంలో రైతులు

ABN , First Publish Date - 2022-09-26T01:43:10+05:30 IST

ఒకరు బాపట జిల్లా కలెక్టర్.. మరొకరు ప్రకాశం జిల్లా మహిళా కలెక్టర్. వీరిద్దరూ భార్యభర్తలు. భర్త పేరు దినేశ్ కుమార్. భార్య పేరు విజయ్ కృష్ణన్. వీరిద్దరికి ...

Bapatla: పొలంలో కలెక్టర్లు.. ఆశ్చర్యంలో రైతులు

ఒకరు బాపట జిల్లా కలెక్టర్.. మరొకరు ప్రకాశం జిల్లా మహిళా కలెక్టర్. వీరిద్దరూ భార్యభర్తలు. భర్త పేరు దినేశ్ కుమార్. భార్య పేరు విజయకృష్ణన్. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. కలెక్టర్లిద్దరూ పక్కక్క జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపలిద్దరూ పనిలో ఎంత నిమగ్నమై ఉంటారో.. ఇంట్లోనూ అంతే అన్యోన్యంగా జీవిస్తుంటారు. కుటుంబంతో సరదా గడుపుతుంటారు. ఇక వీకెంట్ వస్తే చాలు ఫ్యామిలీతో కలిసి సందడి చేస్తారు.


అయితే ఈ దంపతులను వారి పిల్లలు వ్యవసాయం అంటే ఏంటి అని అడిగారు. దాంతో వారు సమాధానం చెప్పకుండా క్యారేజీలు కట్టుకుని నేరుగా వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం నాట్లు సీజన్ కావడంతో పొలంలో దిగి వ్యవసాయం చేశారు. అంతేకాదు తమతో తెచ్చుకున్న భోజనాన్ని తింటూ అక్కడి ఉన్న వారికి పెడుతూ సందడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  


కాగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా దినేశ్ కుమార్ తమ ఇద్దరు పిల్లలతో కలిసి బాపట్ల జిల్లా మునుకొండపాడులోని పొలంలో నాట్లు వేశారు. రెండు జిల్లాల కలెక్టర్లు తమతో కలిసి వరి నాట్లు వేయడం చూసిన రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలెక్టర్ దినేశ్ కుమార్ లుంగీ కట్టి వరి నాట్లు వేయడమే కాక పొలం గట్లపై రైతులతో కలిసి భోజనం చేశారు. కాసేపు వారితో ముచ్చటించారు. సెలవురోజు కావడంతో తమ పిల్లలకు వ్యవసాయంపై చెప్పేందుకు ఇలా చేశామని కలెక్టర్లు తెలిపారు. 



Updated Date - 2022-09-26T01:43:10+05:30 IST