CM Jagan: మంత్రులను హెచ్చరించిన సీఎం జగన్..ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-12-13T17:15:16+05:30 IST

Amaravathi: ఏపీ కేబినెట్ సమావేశం ముగిశాక ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా మంత్రులతో సమావేశమయ్యారు. వారితో విడిగా కాసేపు మాట్లాడారు. ఇకపై ఎవ్వరూ అవినీతికి పాల్పడొద్దని

CM Jagan: మంత్రులను హెచ్చరించిన సీఎం జగన్..ఎందుకంటే..

Amaravathi: ఏపీ కేబినెట్ సమావేశం ముగిశాక ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా మంత్రులతో సమావేశమయ్యారు. వారితో విడిగా కాసేపు మాట్లాడారు. ఇకపై ఎవ్వరూ అవినీతికి పాల్పడొద్దని సూచించారు. ‘‘ఏ చిన్న పొరపాటు చేసిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి‌తో పాటు ఇతర పత్రికలు, మీడియా ఛానళ్లు వరుస కథనాలతో ప్రచురిస్తాయి. ప్రసారం చేస్తాయి. ఇవి ఎన్నికల సమయంలో ఓటర్లను చాలా ప్రభావితం చేస్తాయి. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ చేయాలని, ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి తప్పక వెళ్లాలని సూచించారు. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 21న 8 తరగతి విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్‌ల పంపిణీకి మంత్రివర్గం(AP Cabinet) ఆమోదం తెలిపింది. ఆ రోజున మంత్రుల చేతుల మీదుగా విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని ఆదేశించారు.

Updated Date - 2022-12-13T18:17:28+05:30 IST