-
-
Home » Andhra Pradesh » CM Jagan in Assembly anr-MRGS-AndhraPradesh
-
CM Jagan: రూ. 500 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదు...
ABN , First Publish Date - 2022-09-19T17:41:59+05:30 IST
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి క్రింద చంద్రబాబు రూ. 6.86 లక్షలు ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పి ..

అమరావతి (Amaravathi): పోలవరం డ్యాంకు సంబంధించి చంద్రబాబు (Chandrababu) హయాంలో, వైసీపీ మూడేళ్ల పాలనలో పనుల పురోగతి ఫోటోలను సీఎం జగన్ (CM Jagan) అసెంబ్లీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి క్రింద చంద్రబాబు రూ. 6.86 లక్షలు ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పి జీవో కూడా ఇచ్చిందన్నారు. పెండిగ్లో ఉన్న రూ. 500 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదన్నారు. త్వరలోనే రూ. 500 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు చూస్తామంటే ఏర్పాటు చేస్తామన్నారు. డ్యాం నిర్మాణం అంతా గ్యాప్లుగా నిర్మించారని, 2.1 కి.మీ. పొడవున్న గోదావరి నదికి అప్రోచ్ చానల్‌కు, లోయర్, అప్పర్ కాపర్, డ్యాంలకు రెండు గ్యాప్‌లు పెట్టారన్నారు. వర్షాకాలంలో పనులు ఆగాయని, నవంబర్ నుంచి పనులు ప్రారంభం అవుతాయని సీఎం జగన్ తెలిపారు.