CM Jagan: చంద్రబాబుకు ఎమ్యెలేగా ఉండేందుకు అర్హత లేదు...

ABN , First Publish Date - 2022-09-19T18:00:35+05:30 IST

చంద్రబాబు ఎమ్యెలేగా ఉండేందుకు అర్హత లేని వ్యక్తి అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

CM Jagan: చంద్రబాబుకు ఎమ్యెలేగా ఉండేందుకు అర్హత లేదు...

అమరావతి (Amaravathi): నారా చంద్రబాబు (Nara Chandrababu) ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హత లేని వ్యక్తి అని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అన్నారు. సోమవారం అసెంబ్లీలో  ప్రశ్నోత్తారాల సమయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాకం వల్లే పోలవరం ఆలస్యం అవుతోందన్నారు. పోవలరం (Polavaram) ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి (R&R package)కి ఆరున్నర లక్షలు ఇస్తే.. దాన్ని పది లక్షలు చేస్తామని చెప్పామన్నారు. 41.15 అడుగుల నీటిని పోలవరంలో తొలిదశలో నిలబెడతామని, ఆ లెవల్ వరకూ పునరావాసం అందిస్తామన్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద రూ. 2900 కోట్లు మన డబ్బే ఉందన్నారు. పాత లెక్కల ప్రకారం కేంద్రం చెప్పిన లెక్కలకు చంద్రబాబు తలూపారని విమర్శించారు. గతంలో లక్షన్నర ఇచ్చిన వారికి రూ. 5 లక్షలు ఇస్తామన్నామని.. అంటే ఇంకా మూడున్నర లక్షలు ఇస్తామని చెపుతున్నామని సీఎం జగన్ అన్నారు.

Read more