సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త చికిత్సా విధానాలు: జగన్

ABN , First Publish Date - 2022-08-18T02:42:08+05:30 IST

సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త చికిత్సా విధానాలు: జగన్

సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త చికిత్సా విధానాలు: జగన్

అమరావతి: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరో 754 ప్రొసీజర్‌లు రానున్నాయని, మొత్తం ఆరోగ్య శ్రీ కింద 3,118 చికిత్సా విధానాలు అమలు కావాలన్నారు. సెప్టెంబర్‌ 5 నుంచి కొత్త చికిత్సా విధానాలు అమల్లోకి రానున్నట్లు సీఎం వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇకపై జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌ కార్యకలాపాలు మెడికల్ కాలేజీలోనే ఉండాలని సూచించారు. 

Read more