సీజే మిశ్రాకు సీఎం దంపతుల పరామర్శ

ABN , First Publish Date - 2022-08-15T08:18:33+05:30 IST

సీజే మిశ్రాకు సీఎం దంపతుల పరామర్శ

సీజే మిశ్రాకు సీఎం దంపతుల పరామర్శ

అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దంపతులు పరామర్శించారు. ఆదివారం విజయవాడలోని సీజే నివాసానికి సీఎం జగన్‌, సతీమణి భారతి వెళ్లారు. జస్టిస్‌ మిశ్రా మాతృమూర్తి నళినీ మిశ్రా ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో జస్టిస్‌ మిశ్రాను సీఎం దంపతులు పరామర్శించారు.

Read more