వారెవ్వా... ఏమి భక్తి సారూ!

ABN , First Publish Date - 2022-11-23T00:55:16+05:30 IST

వైసీపీ నేతల పట్ల కొందరు అధికారులు చూపుతున్న ప్రభుభక్తికి నిదర్శనం ఈ చిత్రం. ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అని రాసుకున్న కారుమీదే ‘వాసన్న యువసైన్యం’ అని స్టిక్కర్‌ వేసుకుని మరీ తిరుగుతున్నాడు ఒక జిల్లాస్థాయి అధికారి.

వారెవ్వా... ఏమి భక్తి సారూ!
వాహనంపై ఉన్న రాజకీయ స్టిక్కర్‌

కుప్పం, నవంబరు 22: వైసీపీ నేతల పట్ల కొందరు అధికారులు చూపుతున్న ప్రభుభక్తికి నిదర్శనం ఈ చిత్రం. ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అని రాసుకున్న కారుమీదే ‘వాసన్న యువసైన్యం’ అని స్టిక్కర్‌ వేసుకుని మరీ తిరుగుతున్నాడు ఒక జిల్లాస్థాయి అధికారి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట యానాది కాలనీకి చెందిన ఒక మహిళ, జన్మనిచ్చిన ఇద్దరు బిడ్డలతో సహా కన్నుమూసిన సంఘటనపై విచారణకు జిల్లా అదనపు డీఎంహెచ్‌వో హరినాథరెడ్డి మంగళవారం ఉదయం రామకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. ఆయన కారుమీద ఉన్న ఈ స్టిక్కర్‌ను చూసి మీడియా ఆయనను ప్రశ్నించగా, తాను జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు(వాసన్న)కు బంధువునని, ఆయనపై అభిమానంతోనే స్టిక్కర్‌ వేసుకున్నానని జంకూగొంకూ లేకుండా మరీ సెలవిచ్చారు. ‘ఇది ప్రభుత్వం ఇచ్చిన కారు కాదు, నా సొంతం’ అని కూడా చెప్పారు. సకాలంలో వైద్యం అందక మరణించిన సంఘటనపై విచారణకు వచ్చిన అధికారి తీరుకు జనం నివ్వెరపోయారు.

Updated Date - 2022-11-23T00:55:16+05:30 IST

Read more