-
-
Home » Andhra Pradesh » Chittoor » welcome to applications-NGTS-AndhraPradesh
-
ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పేదవర్గాల కోటా సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2022-08-17T06:59:15+05:30 IST
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పేదవర్గాల విద్యార్థులకు కేటాయించే 25శాతం కోటా సీట్లకు 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వి.శేఖర్ ఒక ప్రకటనలో కోరారు.

తిరుపతి(విద్య),ఆగస్టు 16 : విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పేదవర్గాల విద్యార్థులకు కేటాయించే 25శాతం కోటా సీట్లకు 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వి.శేఖర్ ఒక ప్రకటనలో కోరారు.ఒకటవ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 4, బీసీ, మైనారిటీ, ఓసీలకు 6, అనాథ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధిత కుటుంబాల పిల్లలకు 5శాతం రిజర్వేషన్ చొప్పున సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. గ్రామీణ కుటుంబాల్లో వార్షిక ఆదాయం రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40లక్షల దాటరాదని తెలిపారు. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. వివరాలకోసం ఎంఈవో కార్యాలయాల్లోగానీ లేదా సీఎ్‌సఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.