-
-
Home » Andhra Pradesh » Chittoor » welcome to application-NGTS-AndhraPradesh
-
హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సు ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2022-07-05T05:45:24+05:30 IST
వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (డీహెచ్‌టీటీ)లో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి(కొర్లగుంట), జూలై 4: వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (డీహెచ్‌టీటీ)లో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై, వయస్సు 1-7-2022నాటికి బీసీ, జనరల్ అభ్యర్థులు 15నుంచి 23సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఒకేషనల్ (టెక్స్‌టైల్), ఐఐటీ పాసైన వారు నేరుగా డీహెచ్‌టీటీ కోర్సులలో రెండో సంవత్సరంలో ప్రవేశానికి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 08625-295003, 9399936872, 9866169908, 9010243054 నెంబర్ల్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.