హిజాబ్‌ ధరించడం ఇస్లాం మతాచారం

ABN , First Publish Date - 2022-02-20T05:18:14+05:30 IST

హిజాబ్‌ ధరించడం ఇస్లాం మతాచారం అని, దానిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తామని ముస్లిం మతపెద్దలు, మహిళలు అన్నారు.

హిజాబ్‌ ధరించడం ఇస్లాం మతాచారం
గాంధీ విగ్రహం వద్ద ముస్లింల ర్యాలీ

చిత్తూరులో ముస్లింల నిరసన ర్యాలీ


చిత్తూరు, ఫిబ్రవరి 19: హిజాబ్‌ ధరించడం ఇస్లాం మతాచారం అని, దానిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తామని ముస్లిం మతపెద్దలు, మహిళలు అన్నారు. హిజాబ్‌ మా హక్కంటూ శనివారం చిత్తూరులోని శేషఫిరాన్‌ వీధి మసీదు నుంచి గాంధీ విగ్రహం వరకు ముస్లింలు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత బోధకుడు జిలానీ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రతిఒక్కరూ వారి మతాచాలను ఆచరించవచ్చని, ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదన్నారు. ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం మహిళ హిజాబ్‌ ధరించవచ్చన్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. ముస్లిం నాయకుడు అఫ్జల్‌ఖాన్‌ మాట్లాడుతూ ఓట్ల కోసం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కులమతాలను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం సరైన పద్థతికాదని, అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి చిన్నారెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. ఈ ర్యాలీలో మక్కా మసీదు అధ్యక్షుడు నజీజ్‌, జామియా మసీదు కార్యదర్శి పాహీం బాషా, మత గురువులు ఫిరోజ్‌, ఇమ్రాన్‌, అబ్దుల్‌ షుకూర్‌, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-20T05:18:14+05:30 IST