ఎన్టీఆర్‌ జలాశయం నుంచి నీటి విడుదల

ABN , First Publish Date - 2022-11-12T01:19:32+05:30 IST

పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశారు.

ఎన్టీఆర్‌ జలాశయం నుంచి నీటి విడుదల

పెనుమూరు, నవంబరు 11: పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలైన పూతలపట్టు మండలం కలికిరి కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి జలాశయం పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 300 క్యూసెక్కులకు చేరింది. దీంతో ఒక గేటు ఓపెన్‌ చేసి 300 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలినట్లు ఇరిగేషన్‌ ఏఈ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-11-12T01:19:32+05:30 IST

Read more