వీవోఏ దారుణ హత్య

ABN , First Publish Date - 2022-06-08T05:23:28+05:30 IST

మండలంలోని కొండాపురం పంచాయతీ వడ్డిపాళెం గ్రామంలో వీఏవో దారుణ హత్యకు గురైంది.

వీవోఏ దారుణ హత్య
ధనమ్మ

భర్తపై కేసు నమోదు

వాకాడు, జూన్‌ 7 : మండలంలోని కొండాపురం పంచాయతీ వడ్డిపాళెం గ్రామంలో వీఏవో దారుణ హత్యకు గురైంది.  ఎస్‌ఐ రఘునాథ్‌ కథనం మేరకు.. యనమల ధనమ్మ (56),  రమణయ్య దంపతులు. ధనమ్మ డ్వాక్రా సంఘంలో వీవోఏగా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు సంతానం. 20 సంవత్సరాలుగా కుటుంబ సమస్యలతో దంపతులు విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవించేవారు. ఇటీవల పెద్ద కుమారుడు కరోనా మృతిచెందాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో మళ్లీ దంపతులు ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో ధనమ్మ ఇంట్లో హత్యకు గురైంది. ఇనుప రాడ్డుతో తలపై, ముఖంపై బలమైన గాయాలయ్యాయి. వాకాడు సీఐ హరికృష్ణ ఆ ఇంటిని పరిశీలించారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాలిరెడ్డిపాళెం ఆస్పత్రికి తరలించారు. భర్త రమణయ్యే హత్యచేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు. 

Read more