శ్రీవారి సేవలో ప్రముఖులు

ABN , First Publish Date - 2022-07-18T06:02:26+05:30 IST

తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు
జస్టిస్‌ నాగార్జునరెడ్డి

తిరుమల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వజిత్‌ శెట్టి, తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు, టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. 

 


Read more