30రోజుల్లోగా గ్రామ ప్రణాళిక సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T00:08:36+05:30 IST

గ్రామ ప్రణాళికను 30రోజుల్లోగా సిద్ధం చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ శిక్షణ సంస్థ డైరక్టర్‌ మురళి ఆదేశించారు.

30రోజుల్లోగా గ్రామ ప్రణాళిక సిద్ధం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జడ్పీ సీఈవో, డ్వామా పీడీ తదితరులు

గ్రామ ప్రణాళికను 30రోజుల్లోగా సిద్ధం చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ శిక్షణ సంస్థ డైరక్టర్‌ మురళి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన పంచాయతీరాజ్‌ అధికారులతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా నుంచి జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామ ప్రణాళికలను 29 అంశాలతో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రణాళిక తయారీకి ముందు గ్రామసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ రెడ్డి, డ్వామా పీడీ చంద్రశేఖర్‌, డీపీవో లక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగజ్యోతి, డీఈవో విజయేందర్‌రావు, పశుసంవర్ధకశాఖ జేడీ వెంకట్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:08:36+05:30 IST

Read more