ఎం.కొత్తూరు ఆర్‌బీకేలో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-25T04:56:01+05:30 IST

మండలంలోని ఎం.కొత్తూరు ఆర్‌బీకే కార్యాలయంలో శనివారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఎం.కొత్తూరు ఆర్‌బీకేలో విజిలెన్స్‌ తనిఖీలు
ఎం.కొత్తూరులో ఆర్‌బీకే కార్యాలయాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

నగరి, సెప్టెంబరు 24: మండలంలోని ఎం.కొత్తూరు ఆర్‌బీకే కార్యాలయంలో శనివారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆర్‌బీకే కమిటీ, రైతులు, ప్రజాప్రతినిధులతో ముఖాముఖి చర్చించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ఈశ్వర్‌రెడ్డి, టీం హెడ్‌, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, యంత్రాలు సక్రమంగా అందుతున్నా యా లేదా..? ఈ క్రాప్‌లో పంటలు నమోదు చేస్తున్నారా...? దిగుబడి ఎంత వస్తోంది....? వాటిని ఎలా విక్రయిస్తున్నారనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. రైతులతో నిత్యం సదస్సులు నిర్వహిస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల వద్ద సమాచార బోర్డు లేకపోవడం గుర్తించా మన్నారు. రైతులకు సేవలు సక్రమంగా అందించాలని సూచించారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ నాగసురేష్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ సౌజన్య, వ్యవసాయ అధికారి రాఘవేంద్ర యాదవ్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ శోభ, ఆర్‌బీకే చైర్మన్‌ బుజ్జిరెడ్డి, సర్పంచ్‌ నరసింహులు పాల్గొన్నారు.

Read more