కాణిపాక ఆలయ ఈవోగా వెంకటేశు

ABN , First Publish Date - 2022-11-12T00:32:12+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవోగా వెంకటేశును నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

కాణిపాక ఆలయ ఈవోగా వెంకటేశు
ఈవో వెంకటేశు

ఐరాల(కాణిపాకం), నవంబరు 11: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవోగా వెంకటేశును నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక్కడ ఈవోగా పని చేసిన రాణాప్రతా్‌పను దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీపై పంపారు. కడపలో డిప్యూటి కలెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశు కాణిపాకం ఈవోగా నియమితులయ్యారు. ఈయన గతంలోనూ వరసిద్ధుడి ఆలయ ఈవోగా పని చేశారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - 2022-11-12T00:32:12+05:30 IST

Read more