వెంకటగిరి పోలేరమ్మకు బంగారు కిరీటం వచ్చేసింది!

ABN , First Publish Date - 2022-09-11T07:52:29+05:30 IST

వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి రూ.1.20 కోట్లు వెచ్చించి బంగారు కిరీటాన్ని చెన్నైలో సిద్ధం చేయించారు.

వెంకటగిరి పోలేరమ్మకు బంగారు కిరీటం వచ్చేసింది!

వెంకటగిరిటౌన్‌, సెప్టెంబరు 10: వెంకటగిరిలో ఈనెల 14, 15వ తేదీల్లో పోలేరమ్మ జాతర జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించడానికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాత లు ముందుకు రావడంతో రూ.1.20 కోట్లు వెచ్చించి బంగారు కిరీటాన్ని చెన్నైలో సిద్ధం చేయించారు. ఈ కిరీటం శనివారం రాత్రి వెంకటగిరికి తీసుకురాగా.. పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఎంపీ గురుమూర్తి, కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి, గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ సమక్షంలో దేవదాయశాఖ అధికారులకు ఆనం అప్పగించారు. 

Read more