-
-
Home » Andhra Pradesh » Chittoor » Vedic assembly in Kanipakam-NGTS-AndhraPradesh
-
కాణిపాకంలో వేద సభ
ABN , First Publish Date - 2022-09-11T07:54:33+05:30 IST
కాణిపాకంలో శనివారం వేదపండితులు వేదసభను నిర్వహించారు.

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 10: కాణిపాకంలో శనివారం వేదపండితులు వేదసభను నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆలయం వద్ద వేద సభను నిర్వహించడం ఆనవాయితీ. అలంకార మండపం వద్ద ఉన్న కల్యాణ వేదికపై వేద సభను నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నుంచి 40 మంది వేదపండితులు వచ్చి వేదపఠనం చేశారు. ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.