గుర్తు తెలియని మహిళ మృతి

ABN , First Publish Date - 2022-09-24T06:22:44+05:30 IST

మండలంలోని రమణయ్యకండ్రిగ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.

గుర్తు తెలియని మహిళ మృతి

పూతలపట్టు, సెప్టెంబరు 22: మండలంలోని రమణయ్యకండ్రిగ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. సుమారు 30 సంవత్సరాల వయస్సు కలిగి, ఆరంజ్‌ కలర్‌ చీర ధరించి ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూతలపట్టు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఎక్కడో చంపి ఇక్కడ పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Read more