ద్విచక్రవాహన చోరీ నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-07-05T05:43:22+05:30 IST

పుంగనూరు పట్టణ పరిధిలో ద్విచక్రవాహనాలను చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గంగిరెడ్డి తెలిపారు.

ద్విచక్రవాహన చోరీ నిందితుల అరెస్టు
పోలీసుల అదుపులో నిందితులు

10 బైక్‌ల స్వాధీనం 


పుంగనూరు రూరల్‌, జూలై 4:  పట్టణ పరిధిలో ద్విచక్రవాహనాలను చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు  సీఐ గంగిరెడ్డి తెలిపారు.  సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏటవాకిలి క్రాస్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా హనుమంతరాయదిన్నెకు చెందిన కె.శివ, దుళ్లువాండ్లఇండ్లుకు చెందిన శ్రీనివాసులు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనాల్లో కనిపించగా అదుపులోకి  తీసుకుని విచారణ చేపట్టారు. పుంగనూరు సహా  కర్ణాకట రాష్ట్రంలో 10 ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు అంగీకరించారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ మోహన్‌కుమార్‌, సిబ్బంది  రెడెప్ప, గురుప్రసాద్‌, కేశవరాజు, రవికుమార్‌, శ్రీధర్‌  పాల్గొన్నారు. 

Read more