-
-
Home » Andhra Pradesh » Chittoor » two members sucide-NGTS-AndhraPradesh
-
ఇద్దరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-09-11T06:36:42+05:30 IST
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు కాలనీలలో మనస్తాపం చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు.

తిరుచానూరు, సెప్టెంబరు 10: తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు కాలనీలలో మనస్తాపం చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐలు చిరంజీవి, జగన్నాథరెడ్డి కథనం మేరకు.. వేదాంతపురం పంచాయతీకి చెందిన 250 కాలనీలో పురుషోత్తం(30)నివాసముంటున్నాడు. ఇతడు తిరుపతి నగరపాలక సంస్థలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి. అనారోగ్య కారణంగా ఇంట్లో శనివారం వేకువజామున ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అలాగే లింగేశ్వర్‌నగర్ పంచాయతీకి చెందిన అన్బు(30) పెయింటర్. కుటుంబ కలహాలతో విషం తాగి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.