పోలీసుల అదుపులో ఇద్దరు గంజాయి విక్రేతలు

ABN , First Publish Date - 2022-06-07T07:24:13+05:30 IST

ఇద్దరు గంజాయి వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో ఇద్దరు గంజాయి విక్రేతలు

ఎర్రావారిపాలెం, జూన్‌ 6 : గంజాయి  విక్రయాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈనెల ఐదవ తేదీన దుమ్మురేపుతున్న గంజాయి దమ్ము శీర్షికన ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైన వార్తా కథనంపై పోలీసులు స్పందించారు.చిన్నగొట్టిగల్లు ,ఎర్రావారిపాలెం మండలాల్లో గంజాయి విక్రేతల వేట ప్రారంభించారు.ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.ఒకరినుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. గంజాయి మత్తుకు అలవాటు పడిన 35మంది యువకులను కూడా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. 

Read more