10న టీటీడీ విదేశీ నాణెల ఈవేలం

ABN , First Publish Date - 2022-02-23T06:48:41+05:30 IST

తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన యూఎ్‌సఏ, మలేషియా దేశాల నాణేలను మార్చి 10వ తేదీన ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

10న టీటీడీ విదేశీ నాణెల ఈవేలం

తిరుపతి(కొర్లగుంట), ఫిబ్రవరి 22: తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన యూఎ్‌సఏ, మలేషియా దేశాల నాణేలను మార్చి 10వ తేదీన ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మలేషియా నాణేలకు ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, యూఎ్‌సఏ నాణేలకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ వేలం వేయనున్నారు. మరిన్ని వివరాలకోసం మార్కెటింగ్‌ విభాగం సీఎం కార్యాలయాన్ని 0877-2264429 నెంబరులో, టీటీడీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.

Read more