లక్ష్యసాధనకు కృషిచేస్తున్నాం: డీఆర్వో రాజశేఖర్‌

ABN , First Publish Date - 2022-08-17T06:18:50+05:30 IST

జిల్లావ్యాప్తంగా రాష్ట్రప్రభుత్వం సూచించిన లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని డీఆర్వో ఎన్‌. రాజశేఖర్‌ అన్నారు.

లక్ష్యసాధనకు కృషిచేస్తున్నాం: డీఆర్వో రాజశేఖర్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న డీఆర్వో రాజశేఖర్‌

 చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 16: జిల్లావ్యాప్తంగా రాష్ట్రప్రభుత్వం సూచించిన లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని డీఆర్వో ఎన్‌. రాజశేఖర్‌ అన్నారు. మంగళవారం వెలగపూడి నుంచి సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శి గణేష్‌, తేజ్‌భరత్‌లు అన్ని జిల్లాల డీఆర్వోలు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న డీఆర్వో మాట్లాడుతూ 90 రోజుల్లో ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూసేకరణ పూర్తిచేస్తున్నామన్నారు. లేఅవుట్లకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని పేర్కొన్నారు. తహసీల్దార్లు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు వాసుదేవన్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Read more