బదిలీలు పారద్శకంగా నిర్వహించాలి: డీఈవో

ABN , First Publish Date - 2022-12-12T00:09:41+05:30 IST

జిల్లాలో ఉపాధ్యాయల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని డీఈవో విజయేంద్రరావు తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ విడుదల చేసిన క్రమంలో ఆదివారం విద్యాశాఖ కార్యాలయ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు.

బదిలీలు పారద్శకంగా నిర్వహించాలి: డీఈవో
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో విజయేంద్రరావు

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 11: జిల్లాలో ఉపాధ్యాయల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని డీఈవో విజయేంద్రరావు తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ విడుదల చేసిన క్రమంలో ఆదివారం విద్యాశాఖ కార్యాలయ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఎలాంటి పొరబాట్లు జరగకుండా సీనియారిటీ బాబితా, రోస్టర్‌ ఆధారంగా బదిలీలు చేయాలన్నారు. విద్యాశాఖలో ఇప్పటికే సిద్ధం చేసిన సీనియారిటీ జాబితాలో చోటు చేసుకున్న చిన్నపాటి పొరబాట్లు సవరించి, ఎలాంటి విమర్శకు తావులేకుండా చూడాలన్నారు. బదిలీల షెడ్యూల్‌ వివరాలు డీఈవో వివరించారు. 12,13 తేదీలలో మేనేజ్‌మెంట్‌, క్యాటగిరి, మీడియం వారిగా బదిలీలకు వెబ్‌సైట్‌లో సమర్పించాలి. 14 నుంచి 17 వరకు హెచ్‌ఎంలు, ఎంఈవోలు పరిశీలించి డీఈవో కార్యాలయానికి పంపాలి. 18,19 తేదీలలో దరఖాస్తుల పరిశీలన, 20 నుంచి 22 వరకు ప్రొవిజినల్‌ సీనియారిటీ జాబితా విడుదల, 23, 24 తేదీలలో అభ్యంతరాల స్వీకరణ, 26న పరిశీలన తుది జాబితా ప్రచురణ, 27 నుంచి జనవరి 1 వరకు ఆప్ణ్షన్‌ ఎంపిక, 2 నుంచి 10 వరకు బదిలీ స్థానాల వివరాలు వెల్లడి, అభ్యర్థనల ఆధారంగా 11న తుది జాబితా, 12న బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏడీ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:09:41+05:30 IST

Read more