తిరుపతిలో నేటినుంచే ట్రాఫిక్‌ మళ్లింపులు

ABN , First Publish Date - 2022-07-18T06:38:17+05:30 IST

శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో సోమవారం నుంచి తిరుపతిలో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ కాటమరాజు వెల్లడించారు. పనులు సుమారు నెలరోజులపాటు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తిరుపతిలో నేటినుంచే ట్రాఫిక్‌ మళ్లింపులు

ఉదయం ఆరు గంటల నుంచే ప్రారంభం

ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మీదుగా రాకపోకలు బంద్‌   

ఫ్లైఓవర్‌ పనులు నెలదాకా కొనసాగే అవకాశం

ప్రజలు సహకరించాలని ట్రాఫిక్‌ డీఎస్పీ విజ్ఞప్తి


తిరుపతి(నేరవిభాగం), జూలై 17: శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో సోమవారం నుంచి తిరుపతిలో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ కాటమరాజు వెల్లడించారు. పనులు సుమారు నెలరోజులపాటు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మీదుగా రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. బయటి ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చి, వెళ్లే బస్సులు, పెద్ద వాహనాలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేశామన్నారు. అలాగే బైక్‌లు, కార్లు తదితర చిన్న, తేలికపాటి వాహనాలకు కూడా ప్రత్యేక మార్గాలను సూచించామన్నారు. 


వాహనాలు ప్రయాణించాల్సిన మార్గాలిలా..

 

హైదరాబాద్‌, కర్నూలు, కడప వైపు నుంచి వచ్చే వాహనాలు కరకంబాడి, లీలామహల్‌ కూడలి మీదుగా తిరుపతికి రాకపోకలు సాగించాలి. 

 నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చెన్నై నుంచి వచ్చి, వెళ్లు వాహనాలు రేణిగుంట రమణవిలాస్‌ సర్కిల్‌ మీదుగా కరకంబాడి, మంగళం, లీలామహల్‌ సర్కిల్‌ మీదుగా నగరంలోకి ప్రవేశించవచ్చు. లేదా... గాజులమండ్యం జంక్షన్‌, ఆర్సీపురం జంక్షన్‌, రామానుజపల్లె చెక్‌పోస్టు, మహిళా వర్సిటీ, బాలాజీకాలనీ మీదుగా నగరంలోకి, అక్కడినుంచి నంది సర్కిల్‌, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండుకు రావొచ్చు. 

పల్లె వెలుగు బస్సులు రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్‌ వరకు, అక్కడినుంచి తిరుచానూరు బైపాస్‌ మీదుగా రేణిగుంట-పూతలపట్టు హైవేపై ఆర్సీపురం జంక్షన్‌, ఎమ్మార్‌పల్లె పోలీసు స్టేషన్‌, అన్నమయ్య కూడలి, వెస్ట్‌చర్చి, బాలాజీకాలనీ, అలిపిరి, కపిలతీర్థం, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండుకు రావాలి. 

బెంగళూరు, చిత్తూరు వైపునుంచి వచ్చి, వెళ్లే వాహనాలు రామానుజపల్లె చెక్‌పోస్టు నుంచి మహిళా యూనివర్సిటీ, బాలాజీ కాలనీ, టైన్‌క్లబ్‌, అలిపిరి, కపిలతీర్థం, శ్రీనివాససేతు మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. లేదా.. చంద్రగిరి పట్టణం నుంచి చెర్లోపల్లె, జూపార్క్‌, అలిపిరి, కపిలతీర్థం, శ్రీనివాససేతు మీదుగా బస్టాండుకు రావొచ్చు. 

మదనపల్లె, పీలేరు, రాయచోటి, అనంతపురం వైపు నుంచి వచ్చే, వెళ్లే బస్సులు, ఇతర పెద్ద వాహనాలు చెర్లోపల్లె కూడలి, జూపార్క్‌ మీదుగా అలిపిరి, నంది సర్కిల్‌, శ్రీనివాససేతు మీదుగా గానీ, చెర్లోపల్లె కూడలి, బాలాజీకాలనీ, అలిపిరి, కపిలతీర్థం, శ్రీనివాససేతు మీదుగా ఆర్టీసీ బస్టాండుకు రావాలి. 

బైక్‌లు, కార్లు తదితర చిన్న, తేలికపాటి వాహనాలైతే బస్టాండు ప్రాంతం నుంచి రేణిగుంట, రామానుజం సర్కిల్‌, లక్ష్మీపురం సర్కిల్‌ ప్రాంతాలకు డీబీఆర్‌ హాస్పిటల్‌ మీదుగా రైల్వేగేట్‌, హీరో హోండా షోరూమ్‌ మీదుగా ప్రయాణించాలి. 

Read more