అమరావతి రైతులపై కేసులు అమానుషం

ABN , First Publish Date - 2022-09-13T06:30:25+05:30 IST

అమరా వతిని రాజధానిగా కొనసాగించాలని పాదయాత్ర చేస్తున్న రైతులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయి ంచడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి పేర్కొన్నారు.

అమరావతి రైతులపై కేసులు అమానుషం
విలేకరులతో మాట్లాడుతున్న గురవారెడ్డి

ఏర్పేడు, సెప్టెంబరు 12:  అమరా వతిని రాజధానిగా కొనసాగించాలని పాదయాత్ర చేస్తున్న రైతులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయి ంచడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి పేర్కొన్నారు. ఏర్పేడులో టీడీపీ కార్యకర్తలుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అమ రావతి నుంచి అరసవెల్లికి చేపట్టిన పాద యాత్ర విజయవంతం కావాలని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలి పారు. వైఎస్‌ జగన్‌కు పాలన చేతగాక రాజధానిని మూడు ముక్కలు చేయాల నుకోవడం శోచనీయమన్నారు. ఇకనైనా జగన్‌ కళ్లు తెరిచి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునెయ్య, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్‌, మస్తాన్‌, సుధాయాదవ్‌, నాగరాజు, సింగారయ్య, వెంకటస్వామి, రమణ పాల్గొన్నారు.

Read more