చీటీల పేరుతో టోకరా

ABN , First Publish Date - 2022-12-30T01:23:22+05:30 IST

బట్టల వ్యాపారం పేరుతో కలుపుగోలుగా ఉంటూ చీటీలు కట్టించుకొని కుటుంబ సభ్యులతో పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూళ్లూరుపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు వీధిలో కాపురముంటున్న సీహెచ్‌ పద్మావతి దుస్తుల వ్యాపారం చేసేది.

చీటీల పేరుతో టోకరా
పద్మావతి ఇంటి వద్ద బాధితులు

సూళ్లూరుపేట, డిసెంబరు 29: బట్టల వ్యాపారం పేరుతో కలుపుగోలుగా ఉంటూ చీటీలు కట్టించుకొని కుటుంబ సభ్యులతో పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూళ్లూరుపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు వీధిలో కాపురముంటున్న సీహెచ్‌ పద్మావతి దుస్తుల వ్యాపారం చేసేది.పరిచయాలు పెరగడంతో దానిని ఆసరాగా తీసుకొని చీటీలు వేయించింది.రూ.5లక్షల నుంచి రూ.50లక్షల దాకా చీటీలు వందల సంఖ్యలో జనం కట్టారు.అయితే చీటీలు ముగిసిపోయి నెలలవుతున్నా నగదు ఇవ్వలేదు.ఈ క్రమంలో మూడు రోజుల నుంచి ఫోన్‌ పనిచేయకపోవడంతో బాధితులు కొందరు ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా ఎవరూ కన్పించలేదు.దీంతో కుటుంబంతో పాటు పద్మావతి పరారైనట్లు బాధితులు గుర్తించి గగ్గోలు పెట్టారు. గురువారం కొందరు ఆ ఇంట్లో దూరి దుస్తులు, వస్తు సామగ్రిని అందినకాడికి తీసుకుపోయారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకొని న్యాయం చేస్తామని బాధితులకు సర్దిచెప్పి పంపించారు.

Updated Date - 2022-12-30T01:23:22+05:30 IST

Read more