-
-
Home » Andhra Pradesh » Chittoor » today theppothsvam-MRGS-AndhraPradesh
-
నేటి తెప్పోత్సవంతో ముగియనున్న ప్రత్యేక ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-09-20T05:05:47+05:30 IST
కాణిపాకంలో గత నెల 31న వినాయక చవితి నుంచి నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు మంగళవారం తెప్పోత్సవంతో ముగుస్తాయి.

కాణిపాకంలో గత నెల 31న వినాయక చవితి నుంచి నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు మంగళవారం తెప్పోత్సవంతో ముగుస్తాయి. ఈ తెప్పోత్సవానికి ఆలయ పుష్కరిణిని అధికారులు సిద్ధం చేశారు. పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి కొత్త నీటిని నింపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దయిన ఆర్జిత సేవలను బుధవారం నుంచి యథావిధిగా నిర్వహించనున్నారు.