క్రికెట్‌ టోర్నీ విజేత తిరుపతి జట్టు

ABN , First Publish Date - 2022-10-03T06:04:23+05:30 IST

దసరా పండుగను పురస్కరించుకుని స్థానిక కేవీకే మైదానంలో నిర్వహించిన అండర్‌-13 విజయదశమి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో తిరుపతి జట్టు విజేతగా నిలిచింది.

క్రికెట్‌ టోర్నీ విజేత తిరుపతి జట్టు
విజేతలకు ట్రోఫీలు అందజేసిన దృశ్యం

నగరి, అక్టోబరు 2: దసరా పండుగను పురస్కరించుకుని స్థానిక కేవీకే మైదానంలో నిర్వహించిన అండర్‌-13 విజయదశమి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో తిరుపతి జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో తిరుపతి జెన్‌ అకాడమి, తిరుపతి శ్రీనివాసా అకాడమి టీంలు పోటీపడ్డాయి. టాస్‌ గెలిచిన తిరుపతి శ్రీనివాసా అకాడమి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 20 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తిరుపతి జెన్‌ అకాడమి జట్టు 18.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఏపీఎస్పీడీసీఎల్‌ ఫోర్‌మెన్‌ మోహన్‌రాజ్‌ చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు. కేవీకే క్రికెట్‌ కోచ్‌ బాబు, వ్యాయామ ఉపాధ్యాయులు లోకనాథం, దశరథ, మణి పాల్గొన్నారు.

Read more