Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-10-11T15:27:41+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి..

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి (Tirupathi): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి.. రెండు కిల్లోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న (సోమవారం) స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.73 కోట్లు వచ్చాయని, 83,223 మంది భక్తులు దర్శించుకున్నారని, 36,658 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.


కాగా బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబాని, ఆయన సతీమణి టీనా అంబాని, ఆమె సోదరి మీనా కొఠారి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి సుప్రభాతసేవ, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Read more